prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 March 2026, 3:44 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఇస్లామిక్ పుస్తక స్టాల్ ఏర్పాటు — ఎమ్మెల్యే శ్రీ అశోక్ రెడ్డి హాజరు

ప్రజావాణిన్యూస్(మార్చి21)గిద్దలూరు,స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్,గిద్దలూరు యూనిట్ ఈద్ సందర్భంగా పట్టణంలోని ఈద్‌గాహ్‌లో నిర్వహించిన ఈద్ నమాజ్‌లో ఉత్సాహంగా మరియు సామాజిక స్ఫూర్తితో పాల్గొంది.ఈ సందర్భంగా ప్రజల్లో ఇస్లామిక్ బోధనలపై అవగాహన పెంపొందించేందుకు ఇస్లామిక్ పుస్తక స్టాల్‌ను కూడా ఏర్పాటు చేసింది.ఈ పుస్తక స్టాల్‌లో పవిత్ర ఖుర్‌ఆన్,హదీస్ సంకలనాలు,నైతిక విలువలు,వ్యక్తిత్వ వికాసం మరియు ఆధునిక సమస్యలపై ఇస్లామిక్ దృక్పథంతో కూడిన పుస్తకాలు అందుబాటులో ఉంచారు.ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.సందర్శకులు అందుబాటులో ఉన్న పుస్తకాలపై ఆసక్తి చూపించారు.గౌరవనీయ ఎమ్మెల్యే శ్రీ అశోక్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి హాజరై,గిద్దలూరు యూనిట్ చేస్తున్న కృషిని అభినందించారు.సమాజంలో విద్యా మరియు నైతిక అభివృద్ధికి తోడ్పడే ఇటువంటి కార్యక్రమాలను ఆయన ప్రోత్సహించారు.ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి డా.రోషన్ మొహిద్దీన్ గారు ఈద్ నమాజ్‌లో పాల్గొని,గౌరవనీయ ఎమ్మెల్యే గారికి సియో సాహిత్యాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ SIO సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తూ,సమాజ అభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలను కొనసాగించేందుకు తమ కట్టుబాటును పునరుద్ఘాటించారు.