ఇస్మాయిల్‌ఖాన్‌గూడలో వైభవంగా శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం
ఘట్‌కేసర్, మే 12 (ప్రజావాణి): మేడ్చల్ జిల్లా ఇస్మాయిల్‌ఖాన్‌గూడలోని శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవతా సమేత శ్రీ రేణుక ఎల్లమ్మదేవి దేవాలయంలో మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మదేవి 37వ వార్షిక కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని ఆలయ చైర్మన్ అండ్ ఫౌండర్ ఈగ లలిత కృష్ణ ముదిరాజ్, ఆలయ ధర్మకర్తలు ఈగ మధు ముదిరాజ్, ఈగ నందిని రాము ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ...