prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 1:48 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఇల్లాలు.యుడు..ఓ రౌడీషీటరు*వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం పన్నింది.

వైయస్సార్ జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 24) ప్రొద్దుటూరు  వివాహేతర సంబంధానికి అడొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం పన్నింది. ప్రియుడు, మరో రౌడీషీటర్తో కలిసి కిరాతకంగా హతమార్చాలని కుట్ర పన్నింది. చివరికి పోలీసులకు చిక్కడంతో బెడిసికొట్టి అసలు విషయాలు వెలుగుచూసింది.పోలీసులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.సుపారీ కోసం ప్రియుడికి బంగారమిచ్చిన భార్య.పరిచయం.ఆపై వివాహేతరం ప్రొద్దుటూరు మండలం లింగాపురం చెందిన ఈశ్వర్రెడ్డి,శిల్పారెడ్డి దంపతులు.వీరికి పదిహేళ్ల క్రితం వివాహమైంది.కొన్నిరోజులుగా వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయి.ఈ క్రమంలో శిల్పారెడ్డికి ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న జమ్మలమడుగుకు చెందిన దాసరిగాళ్ల నాగసుధీర్(వివాహితుడు) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అదికాస్తా వివాహేతర సంబంధంగా మారింది. విషయం భర్త ఈశ్వర్రెడ్డికి తెలియడంతో భార్యను పలుమార్లు మందలించారు. దీంతో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న అతన్ని తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ప్రియుడు నాగసుధీర్ కూడా అందుకు ఒప్పుకొన్నాడు. రాజుపాళేనికి చెందిన రౌడీషీటర్ వినయ్కు విషయాన్ని తెలిపాడు. అతని ద్వారా సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన కిరాయి ముఠాకు రూ.10 లక్షలు సుపారీ ఇచ్చి ఈశ్వర్రెడ్డి హత్యకు ప్రణాళికలు రూపొందించారు నగదుకు 14 తులాల బంగారం అమ్మకం:సుపారీకి అవసరమైన నగదు సమకూర్చేందుకు శిల్పారెడ్డి దాదాపు 14 తులాల బంగారాన్ని ప్రియుడికి ఇచ్చింది. నాగసుధీర్ ప్రొద్దుటూరు,జమ్మలమడుగు ప్రాంతాల్లోని పలు దుకాణాల్లో కొంత విక్రయించి, మరికొంత కుదువ పెట్టి డబ్బు తీసుకున్నాడు. అందులో దాదాపు రూ.5 లక్షల వరకు కిరాయి ముఠాకు సుపారీ ఇచ్చాడు.మిగిలిన మొత్తం పనిపూర్తయిన తర్వాత ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు తప్పించుకోవడంతో పన్నాగం కిరాయి ముఠా ప్రొద్దుటూరుకు చేరుకుని హత్యకు ప్రయత్నం చేసింది. ఈశ్వర్రెడ్డి ఎక్కడున్నారు.ఏ మార్గంలో వెళ్తున్నారు అనే కదలికలన్నింటినీ భార్య శిల్పారెడ్డి ఎప్పటికప్పుడు ప్రియుడికి సమాచారం అందించేది. దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా బలంగా ఢీకొట్టి కిందపడిపోయిన తర్వాత కత్తులతో పొడిచి హతమార్చాలని పథకం రచించారు. విఫలమైతే మరోసారి పొలం వద్ద నరికి చంపాలని ప్రణాళిక వేశారు.ఇందులో భాగంగా ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో ఈశ్వర్రెడ్డి బైక్లో వెళ్తుండగా బుధవారం కారుతో ఢీకొట్టారు.అంతటితో ఆగకుండా కత్తులతో చంపే ప్రయత్నం చేశారు. బాధితుడు తప్పించుకుని పోలీసులను ఆశ్రయించారు. అతని ఫిర్యాదుతో శిల్పారెడ్డి, నాగసుధీర్తో పాటు మరికొందరిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు