prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 12:31 pm Digital Edition : PRAJA VANI

ఇల్లంతకుంటలో ఘనంగా MRPS 32వ ఆవిర్భావ దినోత్సవం

ఇల్లంతకుంటలో ఘనంగా MRPS 32వ ఆవిర్భావ దినోత్సవం
మంద కృష్ణ మాదిగ 62వ జన్మదిన వేడుకలు నిర్వహణ
ఇల్లంతకుంట: మండల కేంద్రంలో ఈరోజు ఎంఆర్పీఎస్ (MRPS) 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మంద రాజు మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ 62వ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. నాయకులు ఆయన సేవలను కొనియాడుతూ సామాజిక న్యాయం కోసం చేస్తున్న పోరాటం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కాసుపాక సురేష్, కార్యదర్శి బొడ్డు వెంకటేశం, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు తడ్కపెల్లి భూమయ్య, సీనియర్ నాయకులు గుండెటి రాజు, కాసుపాక శంకర్, బడుగు లింగం, మచ్చ ప్రభాకర్, మచ్చ రాజలింగం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మచ్చ రాజేశం, బెజ్జెంకి రమేష్, శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మంద రవి, ప్రభాకర్, మంద రాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

ఇల్లంతకుంటలో ఘనంగా MRPS 32వ ఆవిర్భావ దినోత్సవం