కళ్యాణదుర్గం.జూన్ 10 ప్రజావాణి ఒక్క దీపంతో మొదలైన ప్రయాణం.నేడు వందల హృదయాలను వెలిగిస్తూ సామాజిక చైతన్యానికి నిలువుటద్దంగా నిలుస్తోంది.సేవకు పరిమితులు లేవు.అందుకే మన ‘ఇన్ఫినిటీ’ (అనంతం) ప్రయాణం అబాగ్యుల కన్నీటిని తుడిచే వరకు ఆగేది లేదు.వ్యక్తిగత ప్రయోజనాల కంటే సామాజిక బాధ్యత గొప్పది.బద్దే నాయక్ సారథ్యంలో మనమందరం కలిసి మారుమూల గ్రామాల్లో మార్పుకు వారధులం అవుదాం .చైర్మన్ బద్దే నాయక్, సంకల్పానికి.నేనున్నాను అనే భరోసానే పేదవాడికి అతిపెద్ద ఆస్తి. ఆ భరోసాను గ్రామగ్రామాన అందించడమే ఇన్ఫినిటీ ట్రస్ట్ లక్ష్యం.సహాయం చేయాలనే తపన ఉన్న చోట ఆటంకాలు ఉండవు. అభాగ్యులకు అండగా నిలవడమే నా జీవిత పరమార్థం .ఒకరితో మొదలైన సేవ, వందల మంది భాగస్వామ్యంతో మహా యజ్ఞంగా మారింది.ఈ ప్రయాణంలో ప్రతి అడుగు అభాగ్యుల సంక్షేమం కోసమే.ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల ఆత్మీయ కలయిక.మేము సైతం సమాజ సేవకు అంటూ ముందుకొచ్చిన సభ్యులు.ఒక్క దీపం వెలిగితే అది కేవలం వెలుతురు మాత్రమే,కానీ వంద దీపాలు కలిసి వెలిగితే అది ప్రళయకాల చీకట్లను సైతం పారద్రోలే శక్తి అవుతుంది.”ఈ మాటలకు నిలువుటద్దంగా నిలుస్తోంది ‘ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్,ఒక్కరితో మొదలైన ఒక సేవా సంకల్పం.. నేడు వందలాది మందిని ఏకం చేస్తూ ఒక గొప్ప ఉద్యమంగా మారింది.అభాగ్యుల కన్నీటిని తుడవడం,ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే ధ్యేయంగా పనిచేస్తున్న’ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్’ నేడు గ్రామీణ ప్రాంతాల్లో సేవా కిరణాలు విస్తరిస్తోంది.ఒక ఆలోచన.లక్షల చిరునవ్వులు ఎవరో ఒకరు సాయం చేస్తారని ఎదురుచూడకుండా,తామే రంగంలోకి దిగి సమాజానికి మేలు చేయాలని ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించబడింది.ప్రారంభంలో చిన్న అడుగుగా మొదలైన ఈ సంస్థ, నేడు వందలాది మంది సభ్యుల భాగస్వామ్యంతో ఒక బలమైన సేవా శక్తిగా ఎదిగింది.మారుమూల గ్రామాల్లో పేదరికంలో మగ్గుతున్న వారికి,ఆదరణ లేని వారికి ఈ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ ఒక కొండంత శక్తిగా మారుతోంది.చైర్మన్ బద్దే నాయక్ సంకల్పం ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ మాట్లాడుతూ.గ్రామీణ ప్రాంతాల్లో అభాగ్యులకు ఆపన్నహస్తం అందించేందుకు,వారి కష్టాల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. సేవ చేయడంలో ఉన్న ఆనందం మరెందులోనూ ఉండదు. మనందరి ఉమ్మడి కృషితో మరిన్ని కుటుంబాల్లో చిరునవ్వులు నింపుదాం”అని పిలుపునిచ్చారు.సేవా కార్యక్రమాల విస్తరణ విద్య, వైద్యం,మరియు ఆపదలో ఉన్న వారికి అత్యవసర సహాయం అందించడంలో ఇన్ఫినిటీ ట్రస్ట్ ఇప్పటికే ఎంతో కృషి చేస్తోంది. సభ్యుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో,మరింత లోతైన ప్రాంతాలకు కూడా తమ సేవలను విస్తరించాలని ట్రస్ట్ నిర్ణయించింది.నిజమైన సేవా గుణం కలిగిన వ్యక్తులు ఇలాగే కలిసి పనిచేస్తే, సమాజంలో మార్పు ఖచ్చితంగా వస్తుందని స్థానికులు కొనియాడుతున్నారు