ఇన్‌చార్జ్ ఎంపీడీఓగా శ్రీపతి బాపూరావు పదవీ బాధ్యతల స్వీకారం
జైపూర్, (ఆగస్టు 01),ప్రజావాణి:
మంచిర్యాల జిల్లా జైపూర్ ఇన్‌చార్జ్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)గా మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపూరావు శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇన్‌చార్జ్ ఎంపీడీఓగా వ్యవహరించిన జి. సత్యనారాయణ నుండి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మండల పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది బాపురావు ను మర్యాదపూర్వకంగా కలిసి, పూలమొక్కలు అందించి, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ఏ. సత్యనారాయణ, టి. శ్రీనివాస్, పి. సురేష్, బి. శ్రావణ్ కుమార్, ఎస్. రాకేష్, బి. వెంకటేష్, ఎం. భాస్కర్, బి. ఉదయ్ కుమార్, బి. సురేందర్, ఏ. రమాదేవి, డి. తిరుమల, ఎస్. సుప్రియ , ఎంపీడీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఇంద్రావతి, జూనియర్ అసిస్టెంట్ ఐ. తిరుపతి, టైపిస్ట్ మధుసూదన్, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.