ఇథనాల్ ఫ్యాక్టరీల వ్యర్థాలతో ప్రజల ప్రాణాలకు ముప్పు – ఫ్యాక్టరీలు మూసివేయాలని సీపీఎం డిమాండ్

బెజ్జంకి, జూలై 9 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం గ్రామంలోని సాగునీటి కాలువను సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుగ్గిల గ్రామ పరిసరాల్లోని ఇథనాల్ ఫ్యాక్టరీల నుంచి విడుదలవుతున్న వ్యర్థ జలాలు సాగునీటి కాలువ ద్వారా తోటపల్లి చెరువులోకి చేరుతున్నాయని ఆరోపించారు.ఈ వ్యర్థాల కారణంగా తోటపల్లి చెరువులో చేపలు మృత్యువాత పడుతున్నాయని, ప్రాజెక్టు పరిధిలోని వ్యవసాయ భూములు, పంటలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు.కాలువలో దుర్వాసన వెదజల్లుతుండటంతో రైతులు పంటలు సాగు...