prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 10:35 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఇడుపుల పాయలో ఘనంగా మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు,..!!

వైఎస్ఆర్ ఇడుపులపాయ జూలై 08 ప్రజావాణి వైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘన నివాళులు అర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న వైఎస్ కుటుంబ సభ్యులు,దివంగత ముఖ్యమంత్రి,మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగాఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు,వైఎస్సార్సీపీ నేతలు,కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు.మాజీ ముఖ్యమంత్రి,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ ఘాట్ వద్ద పూలమాలలు ఉంచి మహానేతకు అంజలి ఘటించారు. అనంతరం మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.సంక్షేమ ప్రదాతగా,అభివృద్ధి విధాతగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలను ఈ సందర్భంగా వైఎస్ కుటుంబ సభ్యులు,పార్టీనేతలు,స్మరించుకున్నారుదివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి శ్రీమతి వైఎస్ విజయమ్మ,శ్రీమతి వైఎస్ భారతి,కడప ఎంపీ వైయస్,అవినాష్ రెడ్డి,ఇతర కుటుంబ సభ్యులు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు,వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద పూలమాలలు ఉంచి మహానేతకు అంజలి ఘటించారు.పేదల సంక్షేమం,రైతుల అభ్యున్నతి, ఆరోగ్య సేవలు, విద్యావకాశాలు,సాగునీటి ప్రాజెక్టులు వంటి రంగాల్లో మహానేత డాక్టర్ వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని నేతలు పేర్కొన్నారు. ప్రజల కోసం ఆలోచించిన నాయకుడిగా,ప్రజల హృదయాల్లో నిలిచిన మహానేతగా వైఎస్సార్ ఎప్పటికీ స్ఫూర్తిదాయకుడని అన్నారు