ఇటుకులపాడులో వెలగని వీధి దీపాలు – అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం!
ఇటుకులపాడు జూలై 02 ప్రజావాణి బద్వేల్ ఇన్చార్జి వినోద్ సాంకేతికతతో జగమంతా వెలిగిపోతుంటే.ఇటుకులపాడు గ్రామం మాత్రం ఇంకా అంధకారంలోనే కొట్టుమిట్టాడుతోంది.గ్రామంలోని పలు వీధుల్లో వీధి లైట్లు వెలగకపోవడంతో రాత్రి వేళల్లో నివాసితులు నరకయాతన అనుభవిస్తున్నారు.సూర్యుడు అస్తమించాడంటే చాలు.గ్రామ వీధులన్నీ అడవిని తలపిస్తున్నాయి.కనీసం నడవడానికి కూడా వీల్లేని ఘోరమైన చీకటి పరిస్థితులు నెలకొన్నాయి.అడుగడుగునా భయం.ఆందోళనలో విద్యార్థులు,వృద్ధులు ఈ అంధకారం కారణంగా రాత్రి వేళల్లో ట్యూషన్లకు,కళాశాలలకు వెళ్ళి వచ్చే విద్యార్థులు,అత్యవసర పనులపై బయటకు వచ్చే మహిళలు,వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కంటిచూపు సరిగా లేని వృద్ధులు చీకట్లో నడవలేక...