prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 6:05 pm Digital Edition : PRAJA VANI

ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో సర్పంచ్ భర్త జోక్యం

ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో సర్పంచ్ భర్త జోక్యం..?

అర్హులకే ఇళ్లు ఇవ్వాలా.. లేక ఒత్తిళ్లకే ప్రాధాన్యమా..?

ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో జోక్యంపై విచారణ కోరుతున్న గ్రామస్థులు

తంగళ్లపల్లి ప్రజావాణి జులై 14 మండలంలోని ఓ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో సర్పంచ్ భర్త జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్ని అర్హతలు ఉన్నవారికే ఇళ్లు ఇవ్వాలని పేర్కొంటూ, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో పేర్లు నమోదు చేయకుండా సంతకాలు చేయించాలని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే, కమిటీలోని ఓ సభ్యుడు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎంపిక ప్రక్రియ అక్కడే నిలిచిపోయినట్లు తెలిసింది. ఈ వ్యవహారాన్ని అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తూ, ఘటనపై సమగ్ర విచారణ జరిపి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరుతున్నారు.