prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 6:22 am Digital Edition : PRAJA VANI

ఇందిరమ్మ  ఇళ్లు గృహ ప్రవేశాలలో ఎలాంటి ప్రోటోకాల్ ధిక్కరణ జరగలేదు

*ఇందిరమ్మ  ఇళ్లు గృహ ప్రవేశాలలో ఎలాంటి ప్రోటోకాల్ ధిక్కరణ జరగలేదు..*

*ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవా లకు  ఎటువంటి ప్రోటోకాల్లేదు*  *లబ్ధిదారుల అభీష్టం మేరకే  కార్యక్రమాలు చేసుకోవచ్చు..*
*
*కొందుర్గు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోగురి పురుషోత్తంరెడ్డి క్లారిటీ..*

షాద్ నగర్ ప్రజావాణి జూన్ 02 :

కొందుర్గ్ మండలంలోని  రేగడి చిల్కమర్రి గ్రామంలో నిన్న నిర్వహించిన  ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం లో ఎలాంటి  ప్రోటోకాల్ ధిక్కరణ జరగలేదని   మరి అలాగే ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశాలకు ఎటువంటి అధికారిక, నిర్బంధ ప్రోటోకాల్ లేదు అని అది కేవలం లబ్ధిదారుల  అభీష్టం మేరకే  మాత్రమే అని ఆయన అన్నారు. ఇవి పేదల సొంతింటి కల నెరవేర్చడానికి ప్రభుత్వం అందిస్తున్న ఇళ్లు. దీనికి సంబంధించిన కార్యక్రమం : లబ్ధిదారులు తమ ఇష్టప్రకారం, తమకు నచ్చిన శుభముహూర్తంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా గృహప్రవేశంచేసుకోవచ్చు.సామూహిక కార్యక్రమాలు: ప్రభుత్వం, స్థానిక అధికారులు కొన్నిసార్లు పెద్ద ఎత్తున సామూహిక గృహప్రవేశాలను నిర్వహిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనడం ఆనవాయితీ అయితే  ఎక్కడ తప్పని సరి ప్రోటోకాల్ లేదని అనవసరంగా  బిఆర్ ఎస్   నాయకులు  నోరు పారేసుకోవడని
మరి అలాగే. ప్రభుత్వ అధికారులను. దూషించవద్దని ఆయన అన్నారు మరి అలాగే  స్థానిక లబ్ది దారూలైన తప్పుడు సునంద- నర్సింలు గారి సొంత  ఆహ్వానం మేరకు వెళ్ళాలని ఆది  ప్రభుత్వ  అధికారిక. కార్యక్రమం కాదని. ఆది వారి సొంత కార్యక్రమం అని  ఆకార్యక్రమంలో  స్థానిక  ఉప సర్పంచ్  వార్డ్ సభ్యులు గ్రామ ప్రజలు  హాజరైనారని ఆయన  మీడియాతో తెలిపారు..