prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 2:40 pm Digital Edition : RAJASHEKARREDDY

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం- బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్

బెజ్జంకి, జూలై 4 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో నేరెళ్ల శాంత–రాములు దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని మాజీ ఎంపీపీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఒగ్గు దామోదర్ మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను సాకారం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. త్వరలో మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో అర్హులైన నిరుపేదలకు మరిన్ని ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రావుల నరసయ్య, దేవస్థానం మాజీ చైర్మన్ జె.ఎల్. ప్రభాకర్, వార్డు సభ్యులు భోనగం రమేష్, ఎలిగే సతీష్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు ఐలేని మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు జె. శ్రీనివాస్, పూర్మా నారాయణరెడ్డి, అడుక్కని నర్సింగం, ప్రశాంత్, గుబిరె కిషన్, సంఘ రమేష్, ఎండీ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.