ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కల సాకారం పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ప్రభుత్వ గృహాలు: డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్

ఘట్‌కేసర్, జూలై 31: పేద ప్రజల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం "ఇందిరమ్మ ఇండ్లు" పథకం ద్వారా సాకారం చేస్తోందని, ఈ గృహాలు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ పేర్కొన్నారు. ఎంఎంసీ ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ 7వ డివిజన్, ఘనపురం గ్రామ పంచాయతీ పరిధిలోని లింగాపురం గ్రామంలో ఇందిరమ్మ గృహ లబ్ధిదారులు లింగాల భూలక్ష్మి–యాదగిరి ఆహ్వానం మేరకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై నూతన గృహాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో...