prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 7:12 am Digital Edition : PRAJA VANI

ఇండస్ట్రియల్ పార్కే కావాలి

* ఇండస్ట్రియల్ పార్కే కావాలి*

*షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్*

*రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని కలిసి ఎకో పార్క్ ప్రతిపాదన విరమించుకోవాలి కోరిన ఎమ్మెల్యే*
షాద్ ప్రజావాణి మే 27 :
షాద్ నగర్ నియోజక వర్గంలోని సిద్దాపూర్ గ్రామంలో ఎకో టోన్ ను ఏర్పాటు చేయవద్దని షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని కలిసి కోరారు. సిద్దాపూర్ మరియు పరిసర గ్రామాల ప్రజలు ఎకో టోన్ ప్రతిపాదనకు పూర్తిగా వ్యతిరేకం అని తెలిపారు. మా ప్రజలు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పడితే ఇక్కడి ప్రజలకు ఉపాధి దొరుకుతుందని భూములు ఇచ్చారు.కానీ ఎకో టౌన్ లాంటి ప్రతిపాదన తెచ్చి మా ప్రాంతాలలో పర్యావరణ సమస్యలను కొని తెచ్చుకోవడానికి సిద్ధంగా లేమని ఎమ్మెల్యే గారు తెలిపారు. ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ…సిద్దాపూర్ లో ఏకో టౌన్ ప్రతిపాదన వద్దని కోరుతున్నందున ముఖ్యమంత్రి గారికి నివేదిస్తానని తెలిపారు. ప్రజలకు అనుకూలంగా నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాశీనాథ్ రెడ్డి పాల్గొన్నారు..