ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధ మహిళ మెడలో మూడు తులాల బంగారు మంగళసూత్రం చోరీ
ఘట్‌కేసర్, జూలై 27: ఘట్‌కేసర్ మండలంలోని కొత్తగూడెం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇంట్లో నిద్రిస్తున్న ఓ వృద్ధ మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని ఇద్దరు దుండగులు సుమారు మూడు తులాల బంగారు మంగళసూత్రాన్ని అపహరించి పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జాల కేతమ్మ (70) అనే వృద్ధ మహిళ మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న వేళ, ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. అనంతరం ఆమె మెడలో...