prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 12:42 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఇంటర్ ఫలితాల షాక్… ఫెయిల్ కావడంతో విద్యార్థి ఆత్మహత్యాయత్నం – పరిస్థితి విషమం

కడపజిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్15)  పోరుమామిళ్ల మండలం చిన్నాయపల్లె గ్రామానికి చెందిన బాబు అనే విద్యార్థి  ఇంటర్ ఫలితాల ఫెయిల్ కావడంతో విద్యార్థి ఆత్మహత్యాయత్నం పరిస్థితి విషమం పోరుమామిళ్ల మండలం చిన్నాయపల్లె గ్రామానికి చెందిన బాబు అనే విద్యార్థి ఇంటర్ ఫలితాలు విడుదల కావడంతో ఫెయిల్ అయిన బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అతన్ని పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో అతని పరిస్థితి విషమించడంతో, మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు.ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు గురై రోదనలు మిన్నంటాయి. ఆసుపత్రి ప్రాంగణంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా డాక్టర్ నాగలక్ష్మిని వివరణ కోరగా, విద్యార్థి తీసుకున్న పాయిజన్ అత్యంత ప్రమాదకరమైనదని, రిమ్స్‌కు తరలించే వరకు అవసరమైన ఇంజక్షన్లు, మెడిసిన్లు అందుబాటులో ఉంచామని, ప్రస్తుతం పరిస్థితి తీవ్రమైనదిగా ఉందని తెలిపారు.