ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ ఘనపరిచిన నలంద జూనియర్ కళాశాల విద్యార్థులను అభినందించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

నంద్యాల జిల్లాప్రజావాణి న్యూస్ (ఏప్రిల్15) నంద్యాల.నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో నంద్యాలలోని నలంద జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులతో ప్రభంజనం సృష్టించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తిస్తూ,నంద్యాలలోని మంత్రిగారి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొని, విద్యార్థులను మరియు కళాశాల యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాల పట్టణానికి చెందిన నలంద జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి...