నంద్యాల జిల్లాప్రజావాణి న్యూస్ (ఏప్రిల్15) నంద్యాల.నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో నంద్యాలలోని నలంద జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులతో ప్రభంజనం సృష్టించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తిస్తూ,నంద్యాలలోని మంత్రిగారి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొని, విద్యార్థులను మరియు కళాశాల యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాల పట్టణానికి చెందిన నలంద జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించడం అభినందనీయని . కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించిన విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు అన్నారు . కేవలం అకడమిక్ ఫలితాలే కాకుండా జేఈఈ మెయిన్స్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనూ ప్రతిభ చూపడం విద్యార్థుల పట్టుదలకు నిదర్శనం అన్నారు.నాణ్యమైన విద్యను అందిస్తూ,నంద్యాల ప్రాంత కీర్తిని పెంచుతున్న నలంద కళాశాల యాజమాన్యాన్ని ఏబీఎల్ రెడ్డి మరియు రామ్మోహన్ రెడ్డి లను,కృషి చేసిన అధ్యాపక బృందాన్ని మరియు ప్రోత్సహించిన తల్లిదండ్రులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను,”అని తెలిపారు.అనంతరం మంత్రి ఫరూక్ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శాలువాతో సత్కరించి,వారి భవిష్యత్తు మరిన్ని విజయాలతో సాగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా నలంద కళాశాల డైరెక్టర్లు ఏ.బి.ఎల్. రెడ్డి మరియు రామమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం జేఈఈ మెయిన్స్‌లో మా విద్యార్థులు 92% ఉత్తీర్ణత సాధించడం గర్వకారణం అన్నారు.విద్యార్థులకు ఇంటర్మీడియట్‌తో పాటు ఈఏపీసెట్,జేఈఈ మెయిన్స్,నీట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ అందిస్తున్నామని తెలిపారు.ప్రశాంతమైన వాతావరణం,విశాలమైన తరగతి గదులు మరియు బాలబాలికలకు ప్రత్యేక హాస్టల్ వసతి మా కళాశాల ప్రత్యేకత.అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు,వారికి వెన్నుముకగా నిలిచిన తల్లిదండ్రులకు మరియు నిరంతరం శ్రమించిన అధ్యాపక బృందానికి కళాశాల యాజమాన్యం హృదయపూర్వక ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.ఫలితాలు సాధించిన విద్యార్థులు సీనియర్ ఎంపీసీలో సునీత (988), ఎం.రంగ స్వాతి (984) మార్కులతో సత్తా చాటారని,సీనియర్ బైపీసీలో డి.షారుణ్ (982),యు.శృతి (981) ఉత్తమ మార్కులు సాధించారని.జూనియర్ ఎంపీసీలో గయ నరసింహుడు (465), సునంద (464), ఉమాదేవి (461),అజయ్ కుమార్ (461), ప్రవల్లిక (461), లక్ష్మీదేవి (460) మార్కులతో అగ్రస్థానంలో నిలిచారని.జూనియర్ బైపీసీలో యామిని (444), రూబీనవి (441) మార్కులు సాధించారని . జూనియర్ సిఇసిలో విద్యార్థులు 450, 425 మార్కులతో రాణించారని తెలిపారు .