
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్21) ఇంటర్మీడియట్ లో బద్వేల్ టౌన్ ఫస్ట్ సాధించిన చక్రధర్ ను సన్మానించిన ఉమ్మడి కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి, మరియు జీవీ సుబ్బారెడ్డి,ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో బద్వేల్ పట్టణంలో ప్రథమ స్థానం సాధించిన గౌతమ్ జూనియర్ కళాశాల విద్యార్థి రెడ్డివారి చక్రధర్ (988/1000)ను డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి,ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ విజయానికి కారకులైన గౌతమ్ కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థి తల్లిదండ్రులు వెంకటరామయ్య, రంగలక్ష్మమ్మలను అభినందించారు.చక్రధర్ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని,అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.