ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో బూర్గంపహాడ్ కేజీబీవీ కళాశాల విద్యార్థిని B. నీలిమ 976 మార్కులతో ప్రభంజనం,.
బూర్గంపహాడ్ /ప్రజావాణి /మండల/ ప్రతినిది /ఆదివారం మే 17,.
బూర్గంపాడు మండలంలోని కేజీబీవీ కళాశాల విద్యార్థిని B నీలిమ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 976 మార్కులు సాధించి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయిలో మూడో ర్యాంకును కైవసం చేసుకున్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని నీలిమను జిల్లా విద్యాశాఖ అధికారి చేతుల మీదుగా 10 పదివేల రూపాయలు నగదు బహుమతితో ఘనంగా సత్కరించారు. మరియు ప్రశంస పత్రాన్ని అందించారు. భవిష్యత్తులో చదువులో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్పొరేషన్ మేయర్ గణేష్ నాయక్, కళాశాల ప్రిన్సిపాల్ M.సుశీల, తోటి ఉపాధ్యాయులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు