ఆషాడ మాసం సందర్భంగా గీతాశ్రమ పాఠశాలలో గోరింటాకు వేడుకలు
బెజ్జంకి, ఆగస్టు 7 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని గీతాశ్రమ పాఠశాలలో ఆషాడ మాసం సందర్భంగా గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు గోరింటాకు పెట్టుకుని ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని ఒకరికొకరు గోరింటాకు పెట్టుకున్నారు. ఆషాడ మాసం సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య సందడిగా సాగాయి.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.