ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
ఘట్‌కేసర్, జూన్ 26: ఆశ వర్కర్ల సమస్యలపై ఘట్‌కేసర్‌లో బీ ఆర్ టీ యూ మేడ్చల్ జిల్లా ప్రతినిధి శంభు ప్రభాకర్ ఆధ్వర్యంలో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, రాష్ట్ర ఆశ వర్కర్ల అధ్యక్షురాలు సంతోషి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ఆశ వర్కర్లపై రోజురోజుకూ పెరుగుతున్న పని భారాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆశ వర్కర్లను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని, వారికి స్థిరమైన వేతనం (ఫిక్స్డ్ సాలరీ) అమలు...