ఆశ్రఫ్ అలీ ఆరోగ్య సహాయార్థం రూ.2 లక్షల LOC అందజేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
జిల్లెడ్ చౌదరి గూడ మండల పరిధిలోని పెద్ద ఎల్కిచర్ల గ్రామానికి చెందిన ఆశ్రఫ్ అలీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.ఈ విషయాని వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ద్రుష్టికి తీసుకురావడంతో స్పందించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని,బాధితుడి వైద్య ఖర్చుల నిమిత్తం రెండు లక్షల రూపాయల (రూ.2,00,000/-)ఎల్ఓసి మంజూరు చేయించారు.ఈ సందర్బంగా పెద్ద ఎల్కిచర్ల గ్రామంలోని బాధితుడి నివాసానికి వెళ్లిన స్థానిక నాయకులు,ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు పంపిన ఎల్ఓసి పత్రాన్ని ఆశ్రఫ్ అలీ కుటుంబ సభ్యులకు అందజేశారు.తమకు అత్యవసర సమయంలో ఇంతటి పెద్ద ఆర్థిక సహాయం అందించి ఆదుకున్నందుకు బాధితుడి కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కనక సోని శేఖర్, మాజీ బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోనేరి నర్సింగ్ రావు,మాజీ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు మీదిగడ్డ బాబురావు,మాజీ సర్పంచ్ సయ్యద్ గౌస్,ఉప సర్పంచ్ బాలరాజ్ పాల్గొన్నారు.వార్డు మెంబర్లు మరియు బీఆర్ఎస్ నాయకులు నాజీలిన్ రియాజ్, గంగ నరేష్,ముంతాజ్ అలీ, బోలా రాజు,కె.అరవింద్ రెడ్డి,సి.నాగయ్య,శేఖర్,నవీన్ పటేల్,ఎండీ.లైక్ భాయ్,కార్తీక్, హైమద్,హాజర్,జాహిర్ మరియు తదితరులు పాల్గొన్నారు.