prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 4:46 am Digital Edition : PRAJA VANI

ఆర్టీసీ సమ్మెలో భాగంగా జర్నలిస్ట్ పై దాడి జర్నలిస్టుపై దాడిని ఖండించిన కామారెడ్డిజర్నలిస్ట్ యూనియన్లు

ఆర్టీసీ సమ్మెలో భాగంగా జర్నలిస్ట్ పై దాడి …
– జర్నలిస్టుపై దాడిని ఖండించిన కామారెడ్డి
జర్నలిస్ట్ యూనియన్లు ….
ఆర్టీసీ సమ్మెలో భాగంగా జర్నలిస్ట్ పై దాడి …
– జర్నలిస్టుపై దాడిని ఖండించిన కామారెడ్డి
జర్నలిస్ట్ యూనియన్లు ….

ప్రజావాణి
ఏప్రిల్ 22
కామారెడ్డి జిల్లా ప్రతినిధి

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెని కవరేజ్ చేయడంలో భాగంగా ఎన్టీవీ విలేఖరి ఎండి.ఇలియాసుద్దీన్ పై ఆర్టీసీ డ్రైవర్ దుర్భాషలాడుతూ దాడి చేయడం జరిగింది. సమ్మెలో  అగ్రహంతో ఉన్న డ్రైవర్  మాట మాట పేరిగి ఒకరి పై ఒకరు దాడి చేసికోవడం జరిగింది. ప్రజలకు ప్రత్యక్ష ప్రసారాలు కవరేజ్ చేసే విలేకరులపై దాడి హేయమైన చర్యగా జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. ఎన్ టీవీ రిపోర్టర్ ఇలియాస్ పై దాడిని జర్నలిస్ట్ యూనియన్లు  టిడబ్ల్యూజేఎఫ్,
టియుడబ్ల్యూజేహెచ్ 143, ఐజేయు మరియు కామారెడ్డి జర్నలిస్ట్ యూనియన్లు   తీవ్రంగా ఖండించాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ జర్నలిస్ట్  ఇలియాస్ పై దాడి చేసిన డ్రైవర్ ను వెంటనే అరెస్టు చేసి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ యూనియన్లు డిమాండ్ చేశాయి.