prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 10:03 am Digital Edition : RAJASHEKARREDDY

ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి – బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ దొడ్ల ప్రశాంత్

బెజ్జంకి, ఏప్రిల్ 24 (ప్రజావాణి):

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలనిసిద్దిపేట జిల్లా  బెజ్జంకి మండల బిజెపి సోషల్ మీడియా కన్వీనర్ దొడ్ల ప్రశాంత్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
అలాగే, ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.