ఆర్టీసీ ఆదాయ వృద్ధే లక్ష్యంగా కృషి చేయాలి చెంగిచెర్ల డిపో ఉద్యోగులకు డీఆర్‌ఎం మహేష్ కుమార్ పిలుపు అధిక ఆదాయం సాధించిన కండక్టర్లు, ఇంధనం ఆదా చేసిన డ్రైవర్లకు సన్మానం
చెంగిచెర్ల, జూలై 3: రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ సంస్థకు అధిక ఆదాయం సమకూర్చేందుకు కృషి చేయాలని సికింద్రాబాద్ రీజియన్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ (డీఆర్‌ఎం) మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం చెంగిచెర్ల ఆర్టీసీ డిపోను ఆకస్మికంగా సందర్శించిన ఆయన డిపో కార్యకలాపాలను పరిశీలించి, కార్యాలయ రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఉద్యోగులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ అభివృద్ధికి మరింతగా తోడ్పడగలరని, వ్యక్తిగతంగా కూడా సంక్షేమంగా ఉండగలరని...