ఆర్‌జీకే కాలనీలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ… పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: డివిజన్ అధ్యక్షులు కర్రె రాజేష్

పోచారం, జూలై 14 (ప్రజావాణి): పోచారం 8వ డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప (ఆర్‌జీకే) కాలనీలో పోచారం డివిజన్ 8 వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దేవేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పోచారం డివిజన్ 8 వ వార్డు అధ్యక్షులు కర్రె రాజేష్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)పై అవగాహన కార్యక్రమం కూడా చేపట్టారు. ఈ సందర్భంగా...