ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఎంఆర్‌పీఎస్ సంపూర్ణ మద్దతు – ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించిన ఎంఆర్‌పీఎస్ నాయకులు
నడికూడ ప్రజవాని 31 జూలై
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కేటాయించిన భద్రతా సిబ్బందిని ప్రభుత్వం ఉపసంహరించుకోవడం, అలాగే ఆయనకు కేటాయించిన బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని వెనక్కి తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఎంఆర్‌పీఎస్ నాయకులు పేర్కొన్నారు.

ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు సంఘీభావం ప్రకటించే ఉద్దేశంతో ఈరోజు హరిత కాకతీయ హోటల్‌లో మందశ్యామ్ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంఆర్‌పీఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఎంఆర్‌పీఎస్ తరఫున ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఎంఆర్‌పీఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో పలువురు సామాజిక, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు.