prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 2:55 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఆరోగ్య రాజంపేటయే కూటమి ప్రభుత్వ లక్ష్యం – తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు

రాజంపేట ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్16) కంటి వెలుగు -ప్రతి ఇంటికి” ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన. ఉదయం నుంచి బార్లు తీరిన ప్రజలు.ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న – చమర్తి జగన్ మోహన్ రాజు.వేలాదిగా హాజరైన ప్రజలు ప్రతి ఒక్కరికి ఉచిత రవాణా,వైద్యం,భోజనం ఏర్పాటు,,పట్టణం నియోజకవర్గ పార్టీ కార్యాలయం రాజంపేట.ఆరోగ్య రాజంపేటయే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా ఒక్కో అవయవానికి సంబంధించి ఒక్కో నెలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారు పేర్కొన్నారు.గురువారం నాడు రాజంపేట పట్టణం,ఏ.బి చంద్రారెడ్డి గార్డెన్స్ నందు రేడియంట్ వరల్డ్ ఫౌండేషన్ మరియు సురేంద్ర ఐ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ శ్రీ సురేంద్ర గారి వైద్య బృంద సహకారంతో నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్ఫూర్తితో లోకేష్ బాబు గారి సూచనల మేరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని జగన్ మోహన్ రాజు గారు తెలియజేశారు.అదేవిధంగా ఆయన మాట్లాడుతూ సుండుపల్లె వీరబల్లె నందలూరు ఒంటిమిట్టసిద్ధవటం ప్రాంతాలలో కూడా వైద్య శిబిరాలు ప్రత్యేకంగా నిర్వహిస్తామని జగన్ మోహన్ రాజు గారు తెలిపారు.అంతకుముందు రాజంపేట పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు ఈ శిబిరంలో పాల్గొని వైద్య సేవలు వినియోగించుకున్నారని తెలియజేశారు.అదేవిధంగా వైద్య శిబిరానికి విచ్చేసిన ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలతో పాటు,రవాణా మరియు భోజన వసతి కూడా కల్పించారు.అంతకుముందు వైద్య శిబిరానికి దాదాపు 2026 మందికి పైగా వైద్య సేవలు ఉపయోగించుకోగా,కంటి ఆపరేషన్ నిమిత్తం మొదటి విడతలో 25 మందిని పంపించామని,విడతల వారీగా ఆపరేషన్లు అవసరమైన వారికీ ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తామన్నారు.వైద్య శిబిరంలో రేడియంట్ ఫౌండేషన్ టీమ్ సభ్యులను చమర్తి ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.