ఆరోగ్యవంతమైన బిడ్డకు పునాది తల్లిపాలే

*ఆరోగ్యవంతమైన బిడ్డకు పునాది తల్లిపాలే**చించోడులో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం*షాద్ నగర్ ప్రజావాణి, ఆగస్టు0 5: ఆరోగ్యవంతమైన బిడ్డ ఎదుగుదలకు తల్లిపాలే పునాదిగా నిలుస్తాయని హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడు పరిధిలోని సబ్ సెంటర్ "ఎ" అర్బన్–2 అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడి టీచర్ పద్మ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తూ...