prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 April 2026, 7:34 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఆధిపత్య పోరులో రెక్కలు విప్పిన రేషన్ మాఫియా;;నేనే రాజు.నేనే మంత్రి

ఎన్టీఆర్ డిస్టిక్ ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్2)ఆధిపత్య పోరులో రెక్కలు విప్పిన రేషన్ మాఫియా కొండపల్లి మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం మండలంలో అంతా నాకే కావాలి అంటూ హుకుం జారీ చేస్తున్న రేషన్ డాన్.నన్ను కాదని ఎవడైనా వ్యాపారం చేసాడా.వాడి కథ కంచికే.పోలీస్ ,రెవెన్యూ,విజిలెన్స్,టాస్క్ ఫోర్స్ మీడియా ఇలా ఎన్నో వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నా.ఎవడైనా నా క్రింద బ్రతకాల్సిందే లేదా.నేనేంటో చూపిస్తా.కొండపల్లి కేంద్రంగా సాగుతున్న అక్రమ రేషన్ మాఫియా డాన్ బాగోతం.రోజు రోజుకు మితిమీరిపోతున్న రేషన్ డాన్ ఆగడాలు.అధికారులకు నెల మామూళ్లు చెల్లెస్తున్నాను.నన్ను ఎవరు ఏం చేయలేరు అంటూ బహిరంగ సవాళ్లు విసురుతున్న పిడిఎస్ డాన్.ప్రభుత్వ అధికారులను సైతం పక్కదారి పట్టించేందుకు విశ్వప్రయత్నాలు చేసేది అక్రమ వ్యాపారం ఐనా కూడా అధికార యంత్రాంగం పైన కూడా బురదజల్లే ప్రయత్నాలు.తాను తప్పించుకునేందుకు ఎందరో అమాయకుల్ని బలిపశువులను చేస్తూ తప్పుడు ప్రచారం.తన చీకటి వ్యాపారానికి ఎవరైనా అడ్డొస్తే అనుచరులతో దాడులు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందడం.దశాబ్ద కాలంగా కొండపల్లి ని అడ్డాగా చేసుకుని చీకటి వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఎన్నో దాడులు చేసిన ఘనుడు.చీకటి సామ్రాజ్యానికి  నేనే రాజు.నేనే మంత్రి అనే ధీమాతో ఎవరిని లెక్కచేయని తత్వం.చీకటి వ్యాపారానికి తాను ఒక రారాజు గా ఎదగాలి అని ఆ రేషన్ డాన్ కోరిక నెరవేరేనా.లేదా చీకటి డాన్ కల.కలగానే మిగిలిపోతుందా.కొండపల్లి లో జరుగుతున్న రేషన్ దందా పై పౌర సరఫరాల శాఖ అధికారులు, పోలీసులు ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా.కొండపల్లి కేటుగాడు పై  ప్రజావాణి న్యూస్ స్పెషల్ స్టోరీ.