ఆదివాసీ యువ న్యాయవాదికి రంపచోడవరం బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా అరుదైన గౌరవం…..
ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం,మార్చి 30.
పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండలం పొట్ల వాయిగూడెం గ్రామానికి చెందిన మడివి రవితేజ రంపచోడవరం కోర్టులో లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్న ఆయనని అతి చిన్న వయస్సు లో బార్ అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం అరుదైన గౌరవంగా విలీన మండలాల ఆదివాసీ ప్రజానీకం, శ్రేయోభిలాషులు,సన్నిహితులు మరియు పలు రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.
విద్యార్థి దశ నుండి విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తూ ఆంధ్ర యూనివర్సిటీలో బిఎ ఎల్ఎల్ బి పూర్తిచేసుకుని రంపచోడవరం కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ సామాన్యుల న్యాయవాదిగా విలీన మండలాల్లో మంచి గుర్తింపు పొందారు . బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఆయన ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం పరుస్తున్నారు. భవిష్యత్తులో అత్యుత్తమ పదవులు పొంది ఈ ప్రాంతానికి మరింత వన్నీ తెచ్చే విధంగా రాజకీయాలకి అతీతంగా మీ వృత్తికి న్యాయం చేసే ప్రజానీకం పక్షాన నిలబడాలని ప్రతి ఒక్కరు ఆకాంక్షించారు.