ఆదర్శ పాఠశాల విచారణ కమిటీపై ఆరోపణలు.. సమగ్ర విచారణ జరపాలి- ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి మహేష్

బెజ్జంకి, జూలై 26 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ఆదర్శ పాఠశాలలో ఇటీవల జరిగిన ఘటనపై జిల్లా కలెక్టర్ నియమించిన విచారణ కమిటీ సభ్యులపై డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్ అన్నారు.ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, విచారణ కమిటీపై వచ్చిన ఆరోపణలు నిజమా కాదా అనే విషయాన్ని ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు స్వతంత్రంగా, నిష్పాక్షికంగా విచారించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్...