ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ, యూనిటీగా ఉండి ఆదర్శంగా నిలుస్తున్న బంజారాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని: రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
సిద్దిపేట జిల్లా, మార్చి 11, ప్రజావాణి ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ, యూనిటీగా ఉండి ఆదర్శంగా నిలుస్తున్న బంజారాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు.బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని బంజారా భవన్ లో శ్రీశ్రీశ్రీ సద్గురు సంత సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారాలతో కలిసి బంజారా సాంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాల్లో పాల్గొని బంజారాలతో కలిసి...