prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 6:00 pm Digital Edition : VIJAYKUMAR SIDDIPET

ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ, యూనిటీగా ఉండి ఆదర్శంగా నిలుస్తున్న బంజారాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని: రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

 

సిద్దిపేట జిల్లా, మార్చి 11, ప్రజావాణి

ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ, యూనిటీగా ఉండి ఆదర్శంగా నిలుస్తున్న బంజారాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు.బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని బంజారా భవన్ లో శ్రీశ్రీశ్రీ సద్గురు సంత సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారాలతో కలిసి బంజారా సాంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాల్లో పాల్గొని బంజారాలతో కలిసి బంజారా నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రిి మాట్లాడుతూ.. 287 సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లాలో జన్మించి బంజారా జాతిని ఏకం చేసిన కారణజన్ముడు శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజు అని వారి ఆశీషులతో అందరి సంక్షేమనికి కృషిచేస్తానన్నారు. సుమారు 12 కోట్ల మంది బంజారాలు ఎక్కడున్నా ఒకే, భాష, సంస్కృతీ, సంప్రదాయాలను పాటిస్తూ ఐక్యంగా జీవించడం గొప్పవిషయమని అభినందించారు. వచ్చే సంవత్సరం నుండి సంత్ సేవాలాల్ జయంతిని 15 ఫిబ్రవరి రోజే హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అసంపూర్తి గా ఉన్నా బంజారా భవన్ నిర్మానాన్ని పూర్తి చేసే భాద్యత నాదే నని తెలిపారు. రాజకీయాలకతీతంగా సంఘ ఐక్యతతో సమస్యలను పరిష్కరించుకునుటకు కలిసి రావాలని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం జిల్లా సరిహద్దులను మార్చినప్పుడు హుస్నాబాద్ ప్రాంత ప్రజల కోరిక మేరకు ముందుకు సాగుదామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారా కుల పెద్దలు, బంజారా మహిళలు, బంజారా యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు, ఆత్మ కమిటీ చైర్మన్ ఐలయ్య, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు.