ఆగస్టు 9న ఘనంగా బోనాల సంబరాలు… శివారెడ్డిగూడ, మారుతీనగర్, శ్రీనిధి నెస్ట్ కాలనీల పెద్దల ఏకగ్రీవ నిర్ణయం

ఘట్కేసర్, ఆగస్టు 2: మేడ్చల్–మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని శివారెడ్డిగూడ, మారుతీనగర్, శ్రీనిధి నెస్ట్ కాలనీలలో ఈ నెల 9వ తేదీన బోనాల మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కాలనీల పెద్దలు ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లు, భక్తులకు అవసరమైన సౌకర్యాలపై విస్తృతంగా చర్చించి పలు తీర్మానాలు చేశారు. మూడు కాలనీల ప్రజలంతా భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సంప్రదాయబద్ధంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో బోనాల పండుగను నిర్వహించాలని, ప్రతి కుటుంబం...