అసైన్డ్ ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్: నిబంధనలు, మార్గదర్శకాలు*

అమరావతి (మే 23) ప్రజావాణి దశాబ్దాలుగా అసైన్డ్ ఇంటి స్థలాలు కలిగి ఉన్న పేదలకు మేలు చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.కేటాయించి పదేళ్ల గడువు తీరిన ప్రతి అసైన్డ్ ఇంటి స్థలాన్ని లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ మార్గదర్శకాలను జారీ చేశారు.ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది పేదలకు తమ ఇళ్ల స్థలాలపై పూర్తి స్థాయి శాశ్వత హక్కులు లభిస్తాయి. లబ్ధిదారులు ఈ స్థలాలను...