అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తాం: బొమ్మనపల్లి సర్పంచ్ కొంకట మౌనిక

మన ప్రజావాణి ప్రతినిధి, చిగురుమామిడి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేస్తోందని బొమ్మనపల్లి గ్రామ సర్పంచ్ కొంకట మౌనిక చక్రధరి అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో గ్రామానికి మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తామని ఆమె తెలిపారు. సోమవారం రోజున చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు భోజ మానస–మల్లేశం, మాచమల్ల అఖిల–కిరణ్ కుటుంబాలు నూతన గృహాలలో గృహప్రవేశం నిర్వహించగా, సర్పంచ్...