అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తాం-బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్

బెజ్జంకి, జూలై 5 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన పుర్మా రాణి–మధు దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఆదివారం భూమిపూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ పాల్గొని శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,అర్హత ఉన్న ప్రతి నిరుపేద కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని, పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రావు నరసయ్య, దేవస్థానం మాజీ...