prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 11:32 am Digital Edition : PRAJA VANI

అరుణాచలం రైస్ మిల్లులో ఓరి పొట్టు కింద పడి మహిళమృతి…?  నిబంధనలు పాటించకపోవడమే ఘటనకు కారణమా…?

*అరుణాచలం రైస్ మిల్లులో ఓరి పొట్టు కింద పడి మహిళమృతి…?

 

నిబంధనలు పాటించకపోవడమే ఘటనకు కారణమా…?

 

 

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధిలోని రాజేశ్వరపురం గ్రామంలో అరుణాచలం ఫుడ్ రైస్ మిల్లు పనిచేసే కార్మికురాలు పప్పుల కళ్యాణి (36) ఆదివారం మధ్యాహ్నం మృతి చెందింది. వివరాల్లోకి వెళితే జక్కపల్లి నుండి రోజువారీగా రైస్ మిల్లులోకి కూలీగా పనికి వెళ్ళి పొట్ట ను పై నుండి తోక్కుతు జారి కింద పడడంతో పొట్టు మొత్తం ఆమెపై పడి ఊపిరాడక చనిపోయినట్టు స్థానికులు తెలిపారు.

 

*కార్మికుల భద్రత పాటించని యజమాన్యం…?

 

కార్మికులకు భద్రత పొట్టు వల్ల వచ్చే సూక్ష్మమైన దుమ్ము ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా ఆరోగ్య సమస్యలు పాటించాలని రక్షణ కవచాలు పని చేసే కార్మికులకు నాణ్యమైన మాస్కులు ఎన్ 95 గ్లౌజులు, మరియు కళ్ళద్దాలు తప్పనిసరిగా ఇవ్వాలి అలాంటి ఏ నిబంధనలు పాటించకపోవడమే ఇలాంటి ఘటనలు జరుగుతాయని ప్రజలు పలు విమర్శలు చేస్తున్నారు వెంటిలేషన్ మిల్లు లోపల గాలి వెళ్లేలా యాజమాన్యం చూడాలని ఇప్పటికైనా కార్మికులు భద్రతను దృష్టిలో ఉంచుకొని యాజమాన్యం తగు చర్యలు పాటించాలని ప్రజలు కోరుతున్నారు.