పోరుమామిళ్ల జూన్ 5 ప్రజావాణి ప్రభుత్వ ఆస్పత్రి లోప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న “అమ్మ పేరుతో ఒక మొక్క” కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో బీజేపీ ,టీడీపీ ,జనసేన కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది.పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.మనకు జన్మనిచ్చిన తల్లి పేరుతో ఒక మొక్కను నాటి దాన్ని ప్రాణప్రదంగా సంరక్షించడం మన కనీస ధర్మం.ఈరోజు మనం నాటే ఒక్కొక్క మొక్క.రేపటి మన పిల్లల భవిష్యత్తుకు ఆక్సిజన్ బ్యాంక్ లాంటిది.మొక్కను నాటడంతో పాటు అది వృక్షంగా మారే వరకు ఒక తల్లిలాగా కాపాడుకుంటూ,నిరంతర బాధ్యతగా ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలని. అలాగే మరికొందరిని కూడా ఈ మహా యజ్ఞంలో భాగం చేయాలని కోరుతున్నాను.అలాగే ప్రభుత్వ ఆస్పత్రి లోని సౌకర్యాలను,రోగులను పరామర్శించి,రోగులకు అందుతున్న వైద్యము గురించి ఆస్పత్రి వైద్యులు సాధు వెంకటేశ్వర్లు ,పోతిరెడ్డి నాగలక్ష్మి తాతిరెడ్డి కళ్యాణ్ చక్రవర్తి ని అడిగి తెలుసుకొని,వైద్యుల పనితీరుపట్ల సంతోషం వ్యక్తం చేసారు.స్వయంగా మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ సుప్రజ ప్రభుత్వ ఆస్పత్రి లో దంతాలకు చెకప్ చేయించుకోవడం జరిగింది.ప్రజలు అందరు కూడా ప్రభుత్వం అందించే వైద్య సదుపాయాలను ఉపయోగించుకోవాలన్నారు.ఈ కార్యక్రమం లో బద్వేల్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సెత్తెం ప్రతాప్,బీజేపీ నాయకులూ ఉట్టి శ్రీనివాసులు (జిల్లా ప్రధాన కార్యదర్శి ),పోరుమామిళ్ల మండల అధ్యక్షుడు నాగేంద్ర,నారొజు రమణాచారి (విశ్వకర్మ జిల్లా కన్వీనర్ ),జిల్లా కార్యదర్శి పండరి పల్లంశెట్టి మండల ప్రధాన కార్యదర్శి దుల్ల శ్రీనివాస్ రెడ్డి ,జిల్లా కార్యవర్గ సభ్యుడు కొమినేని రవీంద్ర,కిసాన్ మోర్చా అధ్యక్షుడు తమ్మిశెట్టి రమణ,ఉపాధ్యక్షుడు పోకల బ్రహ్మయ్య,జనసేన నగిరి రమణ,షైక్ ఇమ్రాన్,ఓబీసీ మోర్చా టెంకాయల గురయ్యా, శ్రీనివాసులు మోడీ,కషం గురయ్యా,మండల యువ మోర్చా అధ్యక్షుడు మంగళగిరి భరత్, అభిషేక్,సుదర్శన్ రెడ్డి,మండల కార్యవర్గ సభ్యులు ఉండేలా శ్రీనివాస్ రెడ్డి రామస్వామి తదితరులు పాల్గొన్నారు .