అమీనాబాద్, జల్లి పాఠశాలల్లో ఏబీవీపీ అవగాహన సదస్సు

అమీనాబాద్, జల్లి పాఠశాలల్లో ఏబీవీపీ అవగాహన సదస్సు చెన్నారావుపేట జూలై 22 ప్రజావాణి మండల పరిధిలోని అమీనాబాద్, జల్లి గ్రామాల పాఠశాలల్లో బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..విద్యార్థులలో దేశభక్తిని, జాతీయ భావాలను పెంపొందించడంతో పాటు విద్యారంగ సమస్యలపై పోరాడటమే ఏబీవీపీ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. రక్తదాన శిబిరాలు, గ్రామీణ విద్యాభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాల్లో సంస్థ ముందుంటుందని వివరించారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం, కాశ్మీర్ అంశాలపై జరిగిన ఆందోళనల్లో ఏబీవీపీ చారిత్రక పాత్ర పోషించిందని...