prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 2:50 am Digital Edition : VIJAYKUMAR SIDDIPET

అమరావతి అజేయం: ఆంధ్రుల రాజధానిగా చట్టబద్ధత రావడంపై కూనవరం మండల టేకుబాక, వెంకటయపాలెం, నరసింగపేట, కుళ్లపాడు కూటమి నేతల హర్షం

అమరావతి అజేయం: ఆంధ్రుల రాజధానిగా చట్టబద్ధత రావడంపై కూనవరం మండల టేకుబాక, వెంకటయపాలెం, నరసింగపేట, కుళ్లపాడు కూటమి నేతల హర్షం

 

ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం ఏప్రిల్ 2

 

పోలవరం జిల్లా చింతూరు కూనవరం మండలం అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందడం పట్ల కూనవరం మండల కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం రాష్ట్ర ప్రజలందరూ గర్వించదగ్గ విషయమని, ఇది ఆంధ్రుల ఆత్మగౌరవ విజయమని వారు కొనియాడారు.

ఈ సందర్భంగా మండలంలోని **టేకుబాక, వెంకటయపాలెం,కుళ్లపాడు నరసింగపేట** గ్రామాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీలు నిర్వహించారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టి, మన రాజధాని అమరావతి అంటూ నినాదాలు చేశారు.

*ముఖ్య అంశాలు:*

కృతజ్ఞతలు:* అమరావతి బిల్లుకు పూర్తి మద్దతు తెలిపిన గౌరవ ప్రధానమంత్రికి, కేంద్ర హోం మంత్రికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులకు కూటమి నేతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

అజేయంగా అమరావతి:*ఇకపై రాజధానిగా అమరావతి అజేయంగా నిలుస్తుందని, రాష్ట్ర అభివృద్ధికి ఇది పునాది అని నేతలు ధీమా వ్యక్తం చేశారు.

*సంబరాలు:* గ్రామాల్లో మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని ముగ్గులు వేసి, కొవ్వొత్తులు వెలిగించి పండగ వాతావరణంలో ఈ విజయాన్ని జరుపుకున్నారు.

*పాల్గొన్న వారు:*

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కార్యదర్శి *మడకం చిన్ని*, టేకుబాక గ్రామ శాఖ అధ్యక్షులు *బట్టు భాస్కర్ రావు**, గ్రామ ప్రధాన కార్యదర్శి *కర్రీ వేణు*, సర్పంచ్ *బొల్లి లక్ష్మి*, ఉప సర్పంచ్ *సాయిలీ బుచ్చి రాజు*,మండల తెలుగు యువత నాయకులు *వెళ్ళంకి వెంకన్న*, ఇతర కూటమి నాయకులు, మహిళలు మరియు గ్రామీణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.