prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 5:19 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, అధ్యక్షతన జరిగిన 7వ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్

గుంటూరు ప్రజావాణి న్యూస్ (మే09) అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 7వ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 7వ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీ CM సాయి కాంత్ వర్మ ఐఏఎస్, జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ పాల్గొన్నారు.శుక్రవారం రెండో రోజు నిర్వహించిన ఈ కీలక సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి,పరిపాలనా సామర్థ్యాల పెంపు,సంక్షేమ పథకాల అమలు,మరియు శాంతిభద్రతల పరిరక్షణ వంటి అంశాలపై విస్తృత స్థాయిలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా,పారదర్శకంగా అందేలా అధికార యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు. జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాల అమలు,ప్రజా సమస్యల పరిష్కారం,మరియు నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ జిల్లాలో అమలు చేస్తున్న శాంతిభద్రతల చర్యలు,నేరాల నియంత్రణకు చేపడుతున్న ప్రత్యేక డ్రైవ్‌లు,మహిళల భద్రత ట్రాఫిక్ నియంత్రణ,మరియు ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేసే కార్యక్రమాలపై వివరాలు వెల్లడించారు.అలాగే జిల్లా కలెక్టర్ శ్రీ CM సాయి కాంత్ వర్మ ఐఏఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు ప్రజా సేవల మెరుగుదల,మరియు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.ప్రజల భద్రత,పారదర్శక పాలన,మరియు సమర్థవంతమైన పరిపాలన కోసం జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు