అమరావతిలో మళ్ళీ భారీ అగ్నిప్రమాదం మేఘా కంపెనీ పైపులు దగ్ధం
ప్రజావాణిన్యూస్(మార్చి24) ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది.సోమవారం రాత్రి 11 గంటల సమయంలో తుళ్లూరు మండలం రాయపూడి వద్ద భారీగా మంటలు ఎగసిపడ్డాయి.రాజధాని పనుల కోసం మేఘా ఇంజినీరింగ్ సంస్థ నిల్వ ఉంచిన పైపులకు నిప్పంటుకోవడంతో అవి పూర్తిగా దగ్ధమయ్యాయి. దట్టమైన పొగ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే మూడు అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే,కొన్ని రోజుల క్రితమే వెలగపూడి సమీపంలో ఎల్ అండ్ టీ సంస్థకు...