అమరావతిలో ఎన్ఎఫ్‌డీబీ ప్రాంతీయ కార్యాలయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్;;మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి,ప్రజావాణి న్యూస్(ఏప్రిల్07):అమరావతిలో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (NFDB) ప్రాంతీయ కార్యాల‌యం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.సీఎం చంద్ర‌బాబు కేంద్రానికి లేఖ రాయ‌బ‌ట్టే ఎన్ఎఫ్‌డీబీ ఏర్పాటుకు కేంద్రం ముందుకు వ‌చ్చింద‌న్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ప్రముఖ ఆక్వాకల్చర్ రాష్ట్రంగా ఉండటంతో అమరావతిలో పూర్తి స్థాయి ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన భూమి,ప్రాథమిక మౌలిక సదుపాయాలను రాష్ట్ర...