అభ్యుదయ కాలనీలో తల్లిపాల అవగాహన

  ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి) ములుగు జిల్లా,గోవిందరావుపేట మండలం, పసర గ్రామం,అభ్యుదయ కాలనీలో మంగళవారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ఆగస్టు 1 నుండి 7 వరకు అభ్యుదయ కాలనీ AWC కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం వార్డు మెంబర్ భూక్య భద్రమ్మ గారి అధ్వర్యంలో జరిగింది. గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి వివరంగా అవగాహన కల్పించారు. తల్లిపాలు పిల్లలకు సంపూర్ణ పోషణను ఇస్తాయని, డబ్బా పాల కంటే అమ్మ పాలే మేలని వక్తలు తెలియజేశారు....