prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 7:44 pm Digital Edition : SRIKANTH MULUGU

అభ్యుదయ కాలనీలో తల్లిపాల అవగాహన

 

ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి)

ములుగు జిల్లా,గోవిందరావుపేట మండలం, పసర గ్రామం,అభ్యుదయ కాలనీలో మంగళవారం
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ఆగస్టు 1 నుండి 7 వరకు అభ్యుదయ కాలనీ AWC కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం వార్డు మెంబర్ భూక్య భద్రమ్మ గారి అధ్వర్యంలో జరిగింది.
గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి వివరంగా అవగాహన కల్పించారు.
తల్లిపాలు పిల్లలకు సంపూర్ణ పోషణను ఇస్తాయని, డబ్బా పాల కంటే అమ్మ పాలే మేలని వక్తలు తెలియజేశారు. పుట్టిన గంటలోపు తల్లిపాలు ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బాలురు, బాలికలు, గ్రామస్తులతో పాటు అంగన్వాడీ టీచర్ P. సరిత, ఆశా వర్కర్ M. కొమురమ్మ పాల్గొన్నారు.