అభివృద్ధి పనుల పై గ్రామ సభ

పలు అభివృద్ధి పనుల పై గ్రామ సభ జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఫిబ్రవరి04 (ప్రజావాణి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఈరోజు స్థానిక సర్పంచ్ మారం సునీత రెడ్డి అధ్యక్షతన పలు అభివృద్ధి పనులపై గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యల పరిష్కారంపై గ్రామ ప్రజలతో విస్తృతంగా చర్చించారు. మండల కేంద్రాన్ని మరింత మెరుగుపరిచేలా నూతనంగా ఏర్పాటు చేయనున్న డా బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి, గ్రామ పంచాయతీ సభ్యులు స్థలాన్ని పరిశీలించారు....