గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 25) గుంటూరు అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలి*నగర సుందరీకరణకు అంచనాలు రూపొందించాలి రోడ్ల నిర్మాణంలో నాణ్యత ఉండాలి ప్రజల వినతులపై వెంటనే స్పందించాల* మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారుల సమీక్షలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతగా, వేగవంతంగా యుద్ధప్రాతిపదిక పూర్తి చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్ సూచించారు. ప్రతి డివిజన్లో సమ్మిళిత అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో శనివారం సాయంత్రం స్థానిక శాసనసభ్యుల వారి కార్యాలయంలో ఎమ్మెల్యే నసీర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని వినోభానగర్ రిటైనింగ్ వాల్, డివైడర్స్ నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. నగర సుందరీకరణ విషయంలో ప్రత్యేక ప్రణాళిక అవసరమన్నారు. అన్ని ఐలాండ్ ల బ్యూటిఫికేషన్ కు అంచనాలు రూపొందించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే వినతులపై ఎప్పటికప్పుడు వెంటనే స్పందించాలన్నారు. త్వరలో నియోజకవర్గ ప్రజల కోసం టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. అన్ని రోడ్ల నిర్మాణాల్లో నాణ్యత ఉండాలని, ఎప్పటికప్పుడు నిర్మాణాలను పర్యవేక్షించాలని సూచించారు. పనులు ఎంత వరకు పూర్తయ్యాయి ? ఇంకా ఎంత శాతం పూర్తవ్వాలి ? ఎన్ని రోజులు సమయం తీసుకుంటుంది ? వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. గుంటూరు నగరంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. గత ఐదేళ్లలో తట్ట మట్టి కూడా వేయని నందివెలుగు బ్రిడ్జి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టామని చెప్పారు.